
డిజిటల్ పేమెంట్స్ సేవలు అందించే ఫోన్ పేకు సింగపూర్‌కు చెందిన తన మాతృసంస్థ ఫోన్ పే ప్రైవేట్ లిమిటెడ్ (ఇది వరకు ఫ్లిప్ కా ర్ట్ పేమెంట్స్) నుంచి తాజాగా రూ.743.5 కోట్ల పెట్టు బడులు వచ్చాయి. ఈ మేరకు ఫోన్ పే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ)కు సమాచారం అందిం చింది. ఫ్లిప్ కా ర్ట్‌లో 70 శాతానికిపైగా వాటాను వాల్‌మార్ట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2017లోనూ ఇది ఫోన్ పేకు 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,450 కోట్లు) పెట్టు బడిగా అందజేసింది. గత ఏడాది నుంచి ఈ మొత్తాన్నిఇంటర్నల్ రౌండ్స్ విధానంలో వాల్‌మార్ట్ ఫోన్ పేకు పంపిస్తోంది. ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నఫోన్ పేకు నగదు నిల్వలను పెంచుకోవడానికి ఈ పెట్టు బడులు ఉపకరిస్తాయి. అంతేగాక తన యాప్ కు మరింత ప్రచారం కల్పించుకోవడానికి ఈ కంపెనీ బ్రాండ్ అంబాసి డర్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ను నియమించుకుంది. ఈ ఏడాది ప్రచార కార్యక్రమాల కోసం రూ.500 కోట్లను కేటాయించింది. ఆఫర్లను కొనసాగించాల్సిందే..యెస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు అందిస్తున్న ఫోన్ పే.. పేటీఎం, గూగుల్ పే నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. పీఐ విధానంలో చెల్లిం పులు జరిపిన వారికి పేటీఎం ప్రత్యేక ఆఫర్లను ,క్యాష్ బ్యాక్‌లను ఇస్తోంది. స్క్రాచ్‌కార్డు ల ద్వారాక్యాష్ బ్యాక్‌లు ఇస్తూ గూగుల్ పే కస్టమర్లను ఆకట్టుకుంటోం ది. ప్రముఖ మెసెం జర్ ఆప్ వాట్సాప్ కూడా డిజిటల్ పేమెంట్స్ విభాగంలోకి త్వరలోనే అడుగుపెట్టే అవకావాలు ఉన్నాయి. దీంతో గూగుల్ పే, ఫోన్ పేవంటి కంపెనీలు ప్రచార కార్యక్రమాలకు, క్యాష్ బ్యాక్ లకు పెద్ద ఎత్తున ఖర్చు చేయడాన్ని కొనసాగించాల్సిఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. వాల్‌మార్ట్ ఫ్లిప్ కా ర్ట్‌తోపాటు ఫోన్ పేలో మెజారిటీవాటా కొనుగోలు కోసం వాల్‌మాల్ట్ గత ఏడాది 16బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.10 లక్షల కోట్లు)చెల్లిం చింది. టెన్సెంట్ వంటి కంపెనీల నుంచి కూడా ఫోన్ పేకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు వాటితో చర్చలు జరుపుతోంది.