
సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ సత్తా చాటుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ అమెరికాలో 2 మిలియన్ క్లబ్ లో చేరింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ తన ట్విట్టర్లో తెలిపింది.
ఇప్పటి వరకు యూఎస్ లో చిరంజీవి సినిమాల్లో అత్యధికంగా సైరా నరసింహారెడ్డి 2.6 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఇపుడు వాల్తేరు వీరయ్య ఈ రికార్డ్ ను అధిగమించేలా ఉంది.
బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక పాత్రలో నటించారు. శృతిహాస హీరోయిన్ గా నటించింది. దేవీశ్రీ మ్యూజిక్ అందించగా.. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది.