స్టూడెంట్లు ఉన్నత స్థాయికి ఎదగాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

స్టూడెంట్లు ఉన్నత స్థాయికి ఎదగాలి : కలెక్టర్  ఆదర్శ్  సురభి

వనపర్తి, వెలుగు: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆకాంక్షించారు. శుక్రవారం పట్టణంలోని నాగవరం సోషల్​ వెల్ఫేర్​  గర్ల్స్​​ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీలను, మరికుంట ట్రైబల్​ వెల్ఫేర్​ గర్ల్స్​​గురుకులాన్ని, మైనారిటీ వెల్ఫేర్​  గురుకుల జూనియర్ కాలేజీ, వల్లభ్​నగర్  మైనారిటీ వెల్ఫేర్​ గర్ల్స్​​   గురుకులాన్ని సందర్శించారు. గురుకులాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సౌలతులు కల్పించాలని, ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని సూచించారు. 

విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారనే విషయాన్ని ఆరా తీశారు. సబ్జెక్టులను అర్థమయ్యేలా బోధించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. తాము వెనకబడి ఉన్నామని భావించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. కాలేజీ స్టూడెంట్లు మిల్కీ వైట్  మష్రూమ్  పండించడాన్ని పరిశీలించి అభినందించారు. మ్యాథ్స్​కు సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు నోట్ బుక్స్​ బహుమతిగా అందజేశారు. ఆయన వెంట డీఆర్డీవో ఉమాదేవి, మైనారిటీ శాఖ అధికారి అఫ్జలుద్దీన్, ప్రిన్సిపాల్స్​ సరస్వతి, విజయలక్ష్మి ఉన్నారు.