వనపర్తి జిల్లాలో  టోపోగ్రాఫికల్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి : అడిషనల్ కలెక్టర్  వెంకటేశ్వర్లు

వనపర్తి జిల్లాలో  టోపోగ్రాఫికల్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి : అడిషనల్ కలెక్టర్  వెంకటేశ్వర్లు

వనపర్తి, వెలుగు: జిల్లాలో టోపోగ్రాఫికల్​సర్వే పకడ్బందీగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్  వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో సర్వే ఆఫ్ ఇండియా నోడల్ అధికారి సురేశ్​కుమార్ జిల్లాలోని మండల పరిషత్ స్టాటిస్టిక్స్ అధికారులు, సర్వేయర్లకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ.. టోపోగ్రాఫికల్​సర్వే జిల్లా నైసర్గిక స్వరూపాన్ని ఖచ్చితత్వంతో తెలుపుతుందన్నారు. ప్రొఫార్మాలోని అంశాలపై ఏ చిన్న అనుమానం ఉన్నా నోడల్ అధికారి వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు.  జిల్లా ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ పాల్గొన్నారు. 

సీఎంఆర్​ త్వరగా అప్పగించాలి

సీఎంఆర్ త్వరగా అప్పగించాలని అడిషనల్​కలెక్టర్​వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం  వనపర్తి మండలం కిష్టగిరిలోని లక్ష్మీనరసింహ ఇండస్ట్రీస్, కొత్తకోట మండలం మమ్మలపల్లిలోని రైతు ఆగ్రో ఇండస్ట్రీస్, సంకిరెడ్డిపల్లిలోని కొత్తం ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్​జగన్మోహన్, అసిస్టెంట్ మేనేజర్ బాలు నాయక్ తో కలిసి తనిఖీ చేశారు.