
శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.