War 2: విజయవాడలో 'వార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హృతిక్, ఎన్టీఆర్ రాకతో పెరిగిన అంచనాలు !

War 2: విజయవాడలో 'వార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్..  హృతిక్, ఎన్టీఆర్ రాకతో పెరిగిన అంచనాలు !

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (  Hrithik Roshan  ), టాలీవుడ్ యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ( War 2 ) విడుదలకు సిద్ధమవుతోంది.  భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా, చిత్రబృందం భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమం ఆగస్టు 10న విజయవాడలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఈవెంట్‌కు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

 విజయవాడలోఅంచనాలకు మించి . 
గతంలో, ప్రచార కార్యక్రమాలలో ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి కనిపించరని ఊహాగానాలు వచ్చాయి. వెండితెరపై వారి ముఖాముఖి తలపడటాన్ని మరింత ఉత్కంఠగా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే విజయవాడలో నిర్వహించే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది. 'వార్ 2' చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగే హై-స్టేక్స్ ఫేస్-ఆఫ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. 

వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్
ఈ చిత్రం 2019లో వచ్చిన సూపర్ హిట్ 'వార్' చిత్రానికి సీక్వెల్. ఇది ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందుతున్న వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ లలో ఒక భాగం. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్', 'టైగర్ 3' వంటి విజయవంతమైన చిత్రాలతో ఈ స్పై యూనివర్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 'వార్ 2' ఈ యూనివర్స్‌లో ఆరో చిత్రంగా వస్తోంది. హృతిక్ రోషన్ 'కబీర్' పాత్రలో కొనసాగుతుండగా, జూనియర్ ఎన్టీఆర్ 'విక్రమ్' అనే కొత్త ఏజెంట్‌గా పరిచయం కానున్నారు. వీరిద్దరి మధ్య జరిగే ఉత్కంఠభరితమైన పోరాటాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది.

 

 బాక్సాఫీస్ వద్ద భారీ పోరు!
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పరుష్కరించుకుని ఆగస్టు 14న  'వార్ 2'  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గతంలో 'వేక్ అప్ సిడ్', 'యే జవానీ హై దీవానీ', 'బ్రహ్మాస్త్ర' వంటి విజయవంతమైన చిత్రాలను దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి డైరెక్షన్ చేశారు.   అయితే, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కూలీ' చిత్రం కూడా విడుదల కానుంది. ఇది ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి సినీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. మరి సినీ బాక్సాఫీక్ వద్ద ఎవరు విజయం సాధిస్తారో చూడాలి .