మహబూబ్‎నగర్‎లో ఎమ్మెల్యే వర్సెస్​ జడ్పీ చైర్మన్ ....మాటల యుద్ధం

మహబూబ్‎నగర్‎లో ఎమ్మెల్యే వర్సెస్​ జడ్పీ చైర్మన్ ....మాటల యుద్ధం

పెద్దమందడి, వెలుగు: మండల మహిళా సమైక్య బిల్డింగ్​లో సోమవారం ఎంపీపీ రఘు ప్రసాద్  అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రోటోకాల్  అంటూ లేదని, ప్లానింగ్  బోర్డు వైస్ చైర్మన్ గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డికి కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానించారని ఆరోపించారు. మాజీ మంత్రి అవినీతి పాలన చేశారని విమర్శించారు. దీనిపై జడ్పీ చైర్మన్  కలుగజేసుకుని అప్పుడు మీరు కూడా మాజీ మంత్రి వెంటే ఉన్నారు కదా..

అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి సభలో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం పాత విషయాలు, అనవసర విషయాలు చర్చించకుండా వనపర్తి లో అభివృద్ధిని కొనసాగించాలని లోక్ నాథ్ రెడ్డి సూచించారు.

ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గెలిచిన వారం రోజుల్లోనే పెద్దమందడి మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశామని, రోడ్డు రిపేర్లు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జడ్పీటీసీ రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.