'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' ప్రారంభం ఊహించని మలుపులతో మొదలైంది. 'డబుల్ హౌస్, డబుల్ డోస్' అనే సరికొత్త కాన్సెప్ట్‌తో కింగ్ నాగార్జున గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సీజన్‌లో మొదటిసారిగా సామాన్యలకు కూడా అవకాశం కల్పించారు. 'అగ్నిపరీక్ష'లో విజేతలుగా నిలిచిన ఆరుగురు సామాన్య ప్రజలను 'ఓనర్స్' గానూ, సెలబ్రిటీలను 'టెనెంట్స్' గానూ బిగ్ బాస్ విభజించారు. ఈ విభజనతోనే హౌస్‌లో మొదటి రోజు నుంచే అసలైన డ్రామా మొదలైంది.
తొలి రోజు సంబంధించిన ప్రోమ్స్ రిలీజ్ అయ్యాయి. 'బిగ్ బాస్' హౌస్ లోపలికి అడుగుపెట్టిన మొదటి రోజే ఈ రెండు గ్రూపుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఓనర్స్ గా తమకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని భావించిన కొంతమంది, టెనెంట్స్ తమ మాట వినాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది.
ఈ క్రమంలో టెనెంట్స్ ఇల్లు ఓనర్స్ కు మాత్రమే.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లండని అని టెనెంట్స్ కు 'బిగ్ బాస్' ఆర్డర్ వేశారు. మీకు బిర్యానీ కావాలా.. ఇంకొంచెం వేయనా అని ఇమ్మాన్యుయల్ ను భరణి శంకర్ అడుగుతారు. దీంతో మరో సారి 'బిగ్ బాస్' మీ చేతుల్లో ఉన్న ప్లేట్స్ కూడా హౌస్ లోనే బయటికి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో మాస్క్ మ్యాన్ హరీష్ సీరియస్ అవుతారు . నన్ను తినొద్దంటే చెప్పండి తినను.. నేనైతే నోటి కాడ కూడు లాక్కోను.. ఏమైనా సరే అంటూ సీరియస్ అవుతారు
ALSO READ : ఓటీటీలోకి డిటెక్టివ్ ఫీల్తో, గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్.. డోంట్ మిస్..
విషయం పనుల దగ్గర్నుంచి, తిండి దగ్గరికి వచ్చింది. టెనెంట్స్ ఆహారం తినకూడదని ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తత పెరిగింది. అయితే శ్రీజ దమ్ము వచ్చి ఇమ్మాన్యుయేల్ తో మీరు ఫుడ్ తినొచ్చు.. ఇందువల్ల ఏవైనా పర్యవసానాలు ఉంటే, మేము ఎదుర్కొంటాం అని ధీమాగా చెబుతోంది. ఇంతలో బిగ్ బాస్ జోక్యం చేసుకున్నారు. ఓనర్స్ లివింగ్ ఏరియాలోకి రావాలని, టెనెంట్స్ బయట నిలబడాలని ఆదేశించారు.
ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి ప్రవేశించడానికి వీల్లేదు, బిగ్ బాస్ పంపిన ఆహారాన్ని వెంటనే స్టోర్ రూమ్‌లో పెట్టాలి అని బిగ్ బాస్ హెచ్చరించారు. దీంతో టెనెంట్స్ ఆందోళన చెందారు. "మేము ఇంకా భోజనం చేయలేదు," అని ఒకరు అనగా, "బిగ్ బాస్ ఈరోజు మొత్తం ఆహారం తినకూడదు అంటే ఏం చేయాలి?" అని మరొకరు అడిగారు.
ఈ ఘటనతో ఓనర్స్ , టెనెంట్స్ మధ్య సంబంధాలు మొదటి రోజే చెడిపోయాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ప్రయత్నాలు ఈ సీజన్‌కు ఒక కొత్త కోణాన్ని తీసుకువచ్చాయి. "బిగ్ బాస్ ఒకసారి చెప్పిన తర్వాత, మేము మీ ప్రైవసీకి భంగం కలిగించడం లేదు .. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వస్తే వచ్చి డిస్టర్బ్ చేసి వెళ్లిపోతాడు అని ఒక కంటెస్టెంట్ ( భరణి శంకర్) అన్నారు. ఈ వాదనలు చూస్తుంటే హోస్ట్ నాగార్జున చెప్పినట్లుగా ఈ సీజన్ కేవలం ఆట కాదు, ఒక యుద్ధం అని అర్థమవుతోంది. 'బిగ్ బాస్9' హౌస్‌లో ఆధిపత్య పోరు ఏ విధంగా కొనసాగుతుందో చూడాలి.
