
కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లులోని ఖిలా వరంగల్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులు వేగంగా పూర్తిచేయాలని కుడా వైస్ చైర్పర్సన్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కుడా అధికారులతో కలిసి ఖిలా వరంగల్ లోని తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తర కోటల్లో పర్యటించారు.
గుండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా చేపడుతున్న అడ్వెంచర్స్ స్పోర్ట్స్, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్ పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, డీఈ తదితరులు పాల్గొన్నారు.