వరంగల్ కేఎంసీలో జూనియర్ మెడికోపై సీనియర్ల దాడి

వరంగల్ కేఎంసీలో జూనియర్ మెడికోపై సీనియర్ల దాడి

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల దాడి కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 14వ తేదీన కేఎంసీ ఆవరణలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ మెడికోను సీనియర్లు విచక్షణా రహితంగా కొట్టారు. 

తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధిత విద్యార్థి మట్వాడ పోలీసులకు, యూజీసీకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురు సీనియర్ మెడికోలపై ఐపీసీ 294 -బీ, 323, ర్యాగింగ్ నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. డిసిప్లినరీ కమిటీ భేటీ తర్వాత జూనియర్ విద్యార్థిపై దాడికి పాల్పడ్డ వారిపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.