హనుమకొండ సిటీ, వెలుగు : గుండె సంబంధిత చికిత్సల్లో వరంగల్ మెడికవర్ ఆస్పత్రి మరో అరుదైన ఘనత సొంతం చేసుకుందని మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షఫీ పాలగిరి తెలిపారు.
బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే ట్రాన్స్ కాథెటర్ ఏఆర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (టీఏవీఆర్) విధానం ద్వారా 65 ఏండ్ల మహిళకు విజయవంతంగా గుండె వాల్వ్ మార్పిడి చేసినట్టు చెప్పారు. సుమారు 40 నిమిషాల పాటు సర్జరీ చేశామని, రోగి ఆరోగ్యం మెరుగుపడి, మూడో రోజే డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.
