హనుమకొండ సిటీ, వెలుగు: వందేమాతరం అనేది ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన దేశభక్తి, ఐక్యతకు ప్రతిరూపమని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. వందేమాతరం స్ఫూర్తితో అందరూ ముందుకుసాగాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
వందేమాతర గేయానికి 150 ఏండ్లు నిండిన సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో వడ్డేపల్లి పింగిలి కాలేజీలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను బుధవారం ఎంపీ కావ్య ప్రారంభించారు.
అనంతరం వందేమాతరంపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతకుముందు ఈ ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
