వరంగల్, వెలుగు: వరంగల్‌లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కుటుంబానికి సినీ నిర్మాత బండ్ల గణేశ్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. శనివారం హనుమకొండ పెగడపల్లి డబ్బాలు ప్రాంతంలోని నిరంజన్ నివాసానికి వెళ్లిన బండ్ల గణేష్, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్‌కల్యాణ్ స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున ఈ సాయం అందించినట్లు తెలిపారు.
