లక్షలు పోసినా.. లక్ష్యం నెరవేరలే..!

లక్షలు పోసినా.. లక్ష్యం నెరవేరలే..!

రద్దీ ప్రాంతాల్లో మహిళలు టాయి లెట్స్ కోసం ఇబ్బంది పడకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మొబైల్​ టాయిలెట్స్ ​బస్సులను తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బస్సును వినియోగించకుండా ఇలా మున్సిపల్​ కార్యాలయం పక్కన మట్టికుప్పల వద్ద వదిలేశారు. మహిళల కోసం లక్షలు పోసి కొన్న ఈ మొబైల్​ టాయిలెట్స్​ను సిటీలోని రద్దీ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.  
- ఫొటోగ్రాఫర్, వెలుగు, వరంగల్