- తొలిసారిగా వరంగల్ కమిషనరేట్‍లో వేడుక
- 11 ఏండ్లపాటు బిట్టు సేవలు
- హాజరైన సీపీ అంబర్ కిషోర్‍ఝా
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్‍లో మంగళవారం బిట్టు అనే పోలీస్ కుక్కకు అధికారులు రిటైర్మెంట్ ఫంక్షన్ నిర్వహించారు. కమిషనరేట్ చరిత్రలో మొదటిసారిగా నిర్వహించిన ఈ వేడుకకు సీపీ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై బిట్టును ఘనంగా సత్కరించారు. 2013 డిసెంబర్ 26న కమిషనరేట్ జాగిలాల విభాగంలో స్నిఫర్ డాగ్‍గా చేరి 11 ఏండ్లపాటు సుదీర్ఘ సేవలు అందించింది.
ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రధానమంత్రులు, సీఎంలు, వీవీఐపీలు సభలు, పర్యటనల్లో బిట్టు పేలుడు పదార్థాలను గుర్తించడంలో, వివిధ కేసుల్లో నేరస్తులను పట్టుకోవడంలో హ్యాంగ్లర్గా వ్యవహరించిన కానిస్టేబుల్ ప్రభాకర్‍తో కలిసి కీలకంగా పనిచేసింది. అడిషనల్ డీసీపీ సంజీవ్, సురేశ్‌కుమార్, ఏసీపీ అనంతయ్య, ఆర్‍ఐలు శ్రీనివాస్, స్పర్జన్‍రాజ్, శ్రీధర్, చంద్రశేఖర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్‍కుమార్, డాగ్ స్వ్కాడ్ ఇన్చార్జి ఆనంద్ పాల్గొన్నారు.