హనుమకొండ, వెలుగు: పేకాట ఆడుతున్న బీఆర్ఎస్ నాయకులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుబేదారి పీఎస్ పరిధి ఇందిరానగర్ మై డ్రీమ్ హోమ్స్ లో ఉంటున్న బీఆర్ఎస్ నేత, రియల్టర్ కొక్కిరాల రవీందర్ రావు తన ఇంటిని పేకాట స్థావరంగా మార్చాడు. పేకాట ఆడుతుండగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కొక్కిరాల రవీందర్ రావు ఇంటిపై రైడ్ చేశారు.
ఆ సమయంలో పేకాడుతున్న రియల్టర్లు, బీఆర్ఎస్ నేతలు కొక్కిరాల రవీందర్ రావు, బండ రత్నాకర్ రెడ్డి, దేశిని కోటేశ్వర్, నంగునూరి మనోహర్, కామారపు సత్యనారాయణ, బుస్స లింగమూర్తి, పోలపల్లి రజనీకాంత్ రెడ్డి, బిజ్జల్ నవీన్, రాపాక రఘు, రాచర్ల గోపి అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.91 లక్షల నగదు, పది స్మార్ట్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సీఐ బాబులాల్, ఎస్సైలు ఓ.భానుప్రకాశ్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
