చలాన్లు 120.. ఫైన్ రూ.32,165

చలాన్లు 120.. ఫైన్ రూ.32,165

కాజీపేట, వెలుగు: వరంగల్ జిల్లా కాజీపేట ఎఫ్ సీఐ వద్ద నుంచి మంగళవారం టూవీలర్(ఏపీ 36ఎ ఎక్స్ 4930 )పై ఓ యువకుడు వెళ్తుండగా చెక్ పాయింట్ ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అతని వెహికల్ పై 120 పెండింగ్ చలాన్లతో పాటు రూ.  32,165 ఫైన్ ఉండడం చూసి యువకుడు అవాక్కయ్యాడు.  వెహికల్ ఓనర్ కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, కేసు నమోదు చేసినట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న తెలిపారు.