- నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఘటన
కందనూలు, వెలుగు : వార్డు మెంబర్‌గా గెలిచిన ఓ వ్యక్తి గంటల వ్యవధిలోనే గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కోటాల్‌గడ్డ గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మల్లేశ్ (38) ఏడో వార్డు మెంబర్‌గా పోటీ చేశాడు.
ఆదివారం జరిగిన ఎన్నికల్లో 11 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన మల్లేశ్ రాత్రి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున ఎంతకూ నిద్ర లేవకపోవడంతో గమనించిన అతడి సోదరుడు లేపేందుకు ప్రయత్నించగా.. అప్పటికే చనిపోయి కనిపించాడు.
