కోవిడ్‌‌ అంటే భయమెందుకు? ఇన్వెస్టర్లకు బఫెట్ సూచన

కోవిడ్‌‌ అంటే భయమెందుకు? ఇన్వెస్టర్లకు బఫెట్ సూచన

వెలుగు, బిజినెస్‌‌డెస్క్ కోవిడ్ వైరస్ ప్రపంచ స్టాక్ మార్కెట్లను భయపెడుతోంది. చాలా మంది ఇన్వెస్టర్లు కోవిడ్ భయంతో కంపెనీల్లో ఉన్న తమ షేర్లను అమ్మేసుకుంటున్నారు. ఆసియా నుంచి అమెరికా వరకు ఏ మార్కెట్లలో చూసిన అమ్మకాలే తప్ప కొనుగోళ్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో.. లెజెండరీ ఇన్వెస్టర్, బిలీనియర్ వారెన్ బఫెట్ మాత్రం కోవిడ్ ఎఫెక్ట్‌‌తో తన స్టాక్స్ అమ్మేది లేదని తేల్చి చెప్పారు. తన స్టాక్స్‌‌పై కోవిడ్‌‌ వైరస్ ఎఫెక్ట్ లేదని అన్నారు. అంతేకాక, మీ స్టాక్స్‌‌పై కూడా ఇది ఎఫెక్ట్ చూపుతుందనుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వైరస్ తన లాంగ్‌‌ టర్మ్‌‌ అవుట్‌‌లుక్ మార్చదని పేర్కొన్నారు. వచ్చే వారం లేదా వచ్చే నెల ఏం జరుగబోతుందో అంచనావేసుకుని మనీ సంపాదించే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. కంపెనీల్లో ఉన్న పెట్టుబడులను అమ్మే ఉద్దేశ్యం లేదని పేర్కొన్నారు. మీ ఒరిజినల్ ప్లాన్‌‌పై నమ్మకం ఉంచాలని ఇన్వెస్టర్లకు బఫెట్ సూచించారు. ఒకవేళ లాంగ్‌‌ టర్మ్ ఇన్వెస్ట్‌‌మెంట్ స్ట్రాటజీని కలిగి ఉంటే, ఎలాంటి పరిణామాలు ఎదురైనా రికవర్‌‌ అయ్యేందుకు మీ వద్ద  సమయం ఉంటుందన్నారు. ఇండివిడ్యువల్ స్టాక్స్‌‌ను కొనడం కంటే, తక్కువ కాస్ట్ ఉన్న ఇండెక్స్ ఫండ్స్‌‌ను ఎంపిక చేసుకోవాలని వారెన్ బఫెట్‌‌ చిన్న ఇన్వెస్టర్లకు రికమెండ్ చేశారు. కాగా, చైనాలో వెలుగులోకి వచ్చిన కోవిడ్ వైరస్‌‌, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్ వంటి చాలా దేశాలకు పాకింది. ఇప్పటికే గ్లోబల్ స్లపయి చెయిన్‌‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్లోబల్ ఎకానమిక్ గ్రోత్ తగ్గిపోతోంది. ఇది భయానక వైరస్‌‌ అని చెబుతూనే… తన స్టాక్స్‌‌పై దీని ప్రభావం లేదని వారెన్ బఫెట్ చెప్పడం గమనార్హం.

క్రిప్టోలకు నో వాల్యు…

చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతోన్న క్రిప్టోకరెన్సీలకు ఎలాంటి వాల్యు లేదని బఫెట్ తేల్చారు. ఎలాంటి వాల్యును ఇవి ప్రొడ్యూస్ చేయవని ఈ లెజెండరీ ఇన్వెస్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తన వద్ద ఎలాంటి క్రిప్టోకరెన్సీలు లేవని, భవిష్యత్‌‌లో కూడా ఉండబోవని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కాయిన్‌‌గా పేరున్న బిట్‌‌కాయిన్‌‌పై వారెన్ బఫెట్ 2018లోనే బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.   సీఎన్‌‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ పలు విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. త్వరలో జరగబోతున్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నుంచి క్రిప్టోకరెన్సీలకున్న వాల్యు, కొత్త స్మార్ట్‌‌ఫోన్‌‌ తీసుకోవడం వంటి చాలా ఆసక్తికర విషయాలను సీఎన్‌‌బీసీతో పంచుకున్నారు.

కార్పొరేట్లపై విరుచుకుపడ్డ బఫెట్…

కార్పొరేట్ బోర్డుల్లో మహిళలు లేకపోవడంపై వారెన్ బఫెట్ విరుచుకుపడ్డారు. షేర్‌‌‌‌హోల్డర్స్‌‌కు రాసిన 43వ లేఖలో, తన  ఇన్నేళ్ల సర్వీస్‌‌లో బోర్డు రూమ్‌‌ల్లో  చాలా తక్కువ మంది మహిళలను చూశానని వ్యాఖ్యానించారు. ఓటింగ్ బూత్‌‌లో తమ వాయిస్‌‌లు వినిపించే స్వేచ్ఛ అమెరికన్ మహిళలకు ఉన్నప్పుడు.. బోర్డు రూమ్‌‌ల్లో కూడా వారికి అదే స్వేచ్ఛ ఉంటుందన్నారు. గత  62 ఏళ్లలో బఫెట్.. 21 కంపెనీలకు డైరెక్టర్‌‌‌‌గా పనిచేశారు. బోర్డు రూమ్‌‌ల్లోకి మహిళలను తీసుకురావడంపై బఫెట్ సైతం తన వాయిస్‌‌ను కార్పొరేట్లకు గట్టిగా వినిపించారు. ఇటీవలే గోల్డ్‌‌మాన్ శాక్స్ కూడా బోర్డు రూమ్‌‌ల్లో లింగ వివక్షను తగ్గించేందుకు, తాను పెట్టుబడి పెట్టిన కంపెనీల బోర్డుల్లో ఒక్కరైనా మహిళ ఉండాలని లేకపోతే, పబ్లిక్ వెళ్లేందుకు అనుమతించమని చెప్పింది.