
ముంబై: డబ్బుల నోట్లను తాకిన లేదా లెక్కపెట్టిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్(ఐబీఏ) ప్రజలను కోరుతోంది. దీంతోపాటు బ్యాంక్ బ్రాంచులను విజిట్ చేయడం కంటే ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను వాడాలని సలహాయిచ్చింది. నోట్లను ఫిజికల్‌గా తాకితే కనీసం 20 సెకండ్ల పాటు చేతులను కడుక్కోవాలని ఐబీఏ ప్రజలను కోరింది. కాగా ఈ అసోషియేషన్ ‘కరోనా సే డరో న, డిజిటల్ కరో న’ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. కస్టమర్లకు అంతరాయం లేని ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులను బ్యాంకులు అందిస్తాయని తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి బ్యాంకింగ్ సర్వీసులన్ని అందుబాటులో ఉంటాయని పేర్కొంది.