
మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా శుక్రవారం (జూన్ 27) ఎల్ఏ నైట్ రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒకటి హై థ్రిల్లర్ ను తలపించింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ కు చివరి ఓవర్లో విజయానికి 7 పరుగులు కావలి. క్రీజ్ లో ఫిలిప్స్,ఓబస్ పియెనార్ ఉండడంతో వాషింగ్టన్ విజయంపై అందరూ ధీమాగా ఉన్నారు. చివరి ఓవర్లో రస్సెల్ బౌలింగ్.. స్ట్రైక్ లో పియెనార్ తొలి బంతి వైడ్.. ఇక 6 బంతుల్లో 6 పరుగులు చేయాలి. తొలి బంతికే ఫోర్.. దీంతో చివరి 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే కావాలి. ఇక్కడే రస్సెల్ మ్యాజిక్ చేశాడు.
రెండు, మూడు, నాలుగు బంతులను డాట్ బాల్స్ వేశాడు. పరుగులేమీ రాకపోవడంతో చివరి రెండు బంతులకు రెండు పరుగులు చేయాలి. ఐదో బంతికి పియెనార్ సింగిల్ తీయడంతో చివరి బంతికి సింగిల్ తీయాల్సిన పరిస్థితి. క్రీజ్ లో గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. రస్సెల్ వేసిన బంతిని ఫిలిప్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ హోల్డర్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. క్యాచ్ చేతిలో పడి కింద పడుతుండగా మరోసారి హోల్డర్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. హోల్డర్ క్యాచ్ మిస్ చేయడంతో నైట్ రైడర్స్ ఓడిపోయింది. రస్సెల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ఏ నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆరంభంలో ఉన్ముక్త్ చంద్ (30 బంతుల్లో 41) మెరుపులు మెరిపించగా.. చివర్లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (11 బంతుల్లో 20), ఆండ్రీ రస్సెల్ (13 బంతుల్లో 30*) చెలరేగి ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు. లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి చివరి బంతికి విజయాన్ని అందుకుంది. మిచెల్ ఓవెన్ (43), గ్లెన్ మ్యాక్స్ వెల్ (42), ఫిలిప్స్ (33) విజయంలో కీలక పాత్ర పోషించారు.
CRAZY SCENES IN THE MLC.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2025
- Glenn Phillips the batter.
- Andre Russell the bowler.
- 1 needed in 1 ball.
- Phillips hits straight to Holder.
- Holder juggles once, juggles twice and drops.
- Phillips completes 1 run and won for the team. pic.twitter.com/3QlyTflhd6