మీ టాలెంట్ కు చాట్ జీపీటీ సరిపోదు.. రోడ్లపై అద్భుత చిత్రాలతో ప్రపంచం ఔరా

మీ టాలెంట్ కు చాట్ జీపీటీ సరిపోదు.. రోడ్లపై అద్భుత చిత్రాలతో ప్రపంచం ఔరా

ఆప్టికల్ ఇల్ల్యూషన్స్ ఎల్లప్పుడూ మన కళ్ళను మోసగించే, వాస్తవికతను ప్రశ్నించేలా ఉంటాయి. ఆ టాలెంట్ ను కలిగి ఉన్న కొంతమంది దేశీ మహిళలు వారి సామర్థ్యంతో, నైపుణ్యంతో అందర్నీ ఆకర్షిస్తున్నారు. దేశీ మహిళలు రోడ్లపై అద్భుతమైన ఆప్టికల్ భ్రమలను సృష్టిస్తూ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారారు.

"రోడ్ ఆర్టిస్ట్‌లు" పేరుగాంచిన ఈ మహిళలు మనస్సును కదిలించే కళానైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. వారి క్రియేషన్‌లకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సాధారణ పెయింట్‌లుగా అనిపించే సృజనాత్మకత పద్ధతులను ఉపయోగించి, వారు సాధారణ రహదారులను మంత్రముగ్ధులను చేసే కళాఖండాలుగా మారుస్తున్నారు.

పూనమ్ ఆర్ట్ అకాడమీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోల్లో ఇద్దరు దేశీ మహిళలు రోడ్డుకు మధ్యలో ఉన్న పోల్ చుట్టూ వృత్తాకారంగా తెల్లటి చాక్ పీస్ తో గీతలు గీశారు. దానికి నలుపు సుద్దతో షేడ్ చేసి వాస్తవిక సిమెంటు బావిగా రూపొందించారు. ఈ వీడియోకు 1లక్షా 39వేల వ్యూస్, 5వేల8వందల లైక్‌లు వచ్చాయి. వీరి వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి ప్రతిభను కొనియాడుతున్నారు, మరికొందరు మరిన్న ఆప్టికల్ ఇల్యూషన్ ఆర్ట్‌ను రూపొందించాలని కోరారు.

https://www.instagram.com/p/CsgjFkFpbwo/