ప్రాణాలను లెక్క చేయలే: కారుకు కారు అడ్డుపెట్టి మహిళను కాపాడిండు

V6 Velugu Posted on Nov 22, 2021

స్పీడ్ గా వెళ్తున్న కారుకు మరో వెహికల్ అడ్డుగా వస్తే.. రెండు వాహనాల్లో ఉన్న వారి ప్రాణాలకూ ప్రమాదమే. ఈ విషయం చాలా యాక్సిడెంట్లలో చూసిన, విన్న విషయమే. కానీ ఓ వ్యక్తి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దూసుకెళ్తున్న కారుకు తన కారును అడ్డంగా నిలిపి, అందులో ఉన్న మహిళ ప్రాణాలను కాపాడాడు. అదేంటి ఇది ఇద్దరికీ రిస్క్ కదా అనిపిస్తుందా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ రెండో కారులో ఉన్న మహిళ స్పృహలో లేదు. ఆమె కారు నడుపుతుండగా ఏమైందో ఏమో.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయినా సరే కారు మాత్రం ముందుకు వెళ్తూనే ఉంది. ఆమె స్ఫృహలో లేకపోవడంతో కారు కంట్రోల్ తప్పి.. అడ్డదిడ్డంగా పోతోంది. ఇది మరో కారులో ఆ రోడ్డులోనే వెళ్తున్న హెన్రీ అనే వ్యక్తి గమనించాడు. ఆమె హైవేపై మరో వాహనానికో, చెట్టుకో ఢీకొడితే ప్రాణాలకు ముప్పు తప్పదని గుర్తించి, పెద్ద రిస్కే చేశాడు. సినిమాల్లో హీరోలు చేసినట్టుగా.. వేగంగా ముందుకు దూసుకెళ్లి ఆ మహిళకు తన కారును అడ్డుగా పెట్టాడు. తన ప్రాణాలకు సైతం రిస్క్ అని తెలిసినా జాగ్రత్తగా తన కారుతో అడ్డగించి, ఆమె కారు ఆగేలా చేశాడు. ఆ తర్వాత ఆమె కారు డోర్ తీసి ఎంతగా పిలిచినా స్పందన లేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అత్యవసరంగా పోలీసు బృందం వచ్చి.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే ఆమెను కాపాడడానికి కారు అడ్డుగా పెట్టడంతో అది డ్యామేజీ అయ్యింది. దీంతో ఆమెను కాపాడిన వ్యక్తి మరొకరి కారులో లిఫ్ట్ తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ  ఘటన నెథర్లాండ్స్ లోని ఏ28 హైవేపై జరిగింది. దీనిని మొత్తం వెనుక ఉన్న మరో కారులోని వ్యక్తి వీడియో తీసి, ట్విట్టర్ లో పెట్టాడు.

హీరో అంటూ పొగడ్తలు..

ఈ వీడియోను నవంబర్ 21 రాత్రి 11.26 గంటలకు ట్వీట్ చేయగా.. కేవలం 18 గంటల సమయంలోనే 8.78 లక్షల వ్యూస్ వచ్చాయి. 24 వేల మందికిపైగా లైక్ కొట్టారు. తన కారు డ్యామేజీ అవుతుందని తెలిసినా, ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా మహిళను కాపాడడానికి తెగించిన ఆ వ్యక్తిని హీరో అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు.

 

Tagged woman, car, Sacrifice, car accident, driver, Unconscious

Latest Videos

Subscribe Now

More News