పాట్నాలో ఉద్రిక్తత.. బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

పాట్నాలో ఉద్రిక్తత.. బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

బీహార్ రాజధాని పాట్నలో బీజేపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది.  రాష్ట్రంలో టీచర్ల పోస్టింగ్‌పై  ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు విధానసభ మార్చ్ నిర్వహించారు. అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. అయితే ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను  చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు యూజ్ చేశారు..  లాఠీచార్జి చేశారు. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. పాట్నాలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జూలై 3న భూ కుంభకోణంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చినప్పటి నుంచి బీజేపీ ఆందోళనలను ఉదృతం చేసింది.

ఎన్ని సార్లు లాఠీ ఛార్జ్ చేసినా సరే  నితీష్ కుమార్ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని బీహార్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు  సామ్రాట్ చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ గూండాలు లాఠీఛార్జ్‌ చేస్తున్నారని ఆరోపించారు.