గద్వాల కేజీబీవీలతో పాటు జమ్మిచేడు సమీపంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్స్ నీటి కోసం తిప్పలు పడుతున్నారు. పది రోజుల కింద అయిజ, గద్వాల కేజీబీవీల్లో మోటార్లు కాలిపోవడంతో స్టూడెంట్స్ స్నానాలకు, తాగడానికి నీళ్లు కరువయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు అరగంట మాత్రమే వస్తుండడంతో, బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అయిజ కేజీబీవీలో లీకేజీల కారణంతా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. లీకేజీలతో ట్రంకు పెట్టెలు తుప్పుపట్టి పోతున్నాయని స్టూడెంట్స్ వాపోతున్నారు. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో బయట నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ సరైన సౌలతులు లేవని పేరెంట్స్ వాపోతున్నారు. సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు.
-వెలుగు, గద్వాల/అయిజ