హాలియా, వెలుగు : సాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తుండగా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 88,650 క్యూసెక్కుల వరద వస్తుండగా... సాగర్ వద్ద ఎనిమిది గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 64,632 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312 టీఎంసీలు ) కాగా.. ప్రస్తుతం 589.80 అడుగులు (311 టీఎంసీలు) నీరు ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వకు 2,053 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 21,965 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు
