హాలియా, వెలుగు: నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను అధికారులు సోమవారం సాయంత్రం నిలిపివేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులను నింపేందుకు 20 రోజులుగా నీటిని విడుదల చేశారు. పలు చెరువులను నీటితో నింపారు.
సాగర్ లో నీటి నిల్వలు తగ్గడంతో నేపథ్యంలో నీటి విడుదలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అర్ధాంతరంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కెనాల్ నీటి ఆధారంగా వరి సాగు చేసిన రైతులు పంటలకు నీరు అందుతుందో? లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
