మార్చి 10న హైదరాబాద్ లో ఈ ప్రాంతాల్లో వాటర్​ సప్లయ్​ బంద్

మార్చి 10న  హైదరాబాద్ లో ఈ ప్రాంతాల్లో వాటర్​ సప్లయ్​ బంద్

హైదరాబాద్, వెలుగు: ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి సిటీకి నీటి సరఫరా చేసే కాండూట్(నీటి కాలువ)కు హకీంపేట నుంచి  ఎంఈఎస్ వరకు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు రిపేర్లు చేపడుతున్నారు. దీంతో 10న సిటీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్​బోర్డు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

విజయ్ నగర్ కాలనీ, హుమయూన్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, ఎంఈఎస్, రెడ్ హిల్స్ రిజర్వాయర్ పరిధిలోని బజార్ ఘాట్, ఏసీ గార్డ్స్, రెడ్ హిల్స్, ఇన్ కం ట్యాక్స్ ఏరియా, సెక్రటేరియట్, సీఐబీ క్వార్టర్స్, ఇందిరా నగర్, బీజేఆర్ కాలనీ, అడ్వకేట్ కాలనీ, హిల్స్ కాలనీ, గోకుల్ నగర్, నాంపల్లి రైల్వే స్టేషన్, జంగం బస్తీ, అసెంబ్లీ, ఎస్సీబీ నాంపల్లి, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకాపూల్, సీతారాంబాగ్, గన్ ఫౌండ్రీ, చిరాగ్ అలి లేన్, అబిడ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎల్బీ స్టేడియం, బీఆర్కే భవన్, బిర్లా మందిర్, హిందీ నగర్, గోడేకీ ఖబర్ ప్రాంతాలు, దోమల్ గూడ, గాంధీ నగర్, ఎమ్మెల్యే కాలనీ, సయ్యద్ నగర్, తట్టిఖానా, ఎన్ బీ జే నగర్, నూర్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు స్పష్టం చేశారు.