
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిన్న, పెద్ద జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా లింగాపూర్ మండలంలోని మిట్టె జలపాతం, జైనూర్ మండలంలోని పాన పటర్ ఉశేగాం జలపాతాలు, ములుగు జిల్లాలోని ముత్యంధార జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చుట్టూ ఎత్తయిన గుట్టలు.. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాల నడుమ జాలువారుతున్న ఈ సెలయేర్లు పర్యావరణ ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. పూర్తిగా ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ జలపాతాలను చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
ఆసిఫాబాద్, వెలుగు