హైదరాబాద్: ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా తామే చెడగొట్టామని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. 4 వారాలకే మూవీని ఓటీటీలోకి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. ‘రేవు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ‘కొత్తవాళ్లతో సినిమాలు తీసే ప్రక్రియ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ, 99 శాతం ఫెయిల్ అవుతాయి. ఒకశాతం మాత్రమే సక్సెస్ రేట్.
సినిమా తీయడం ఈ రోజుల్లో గొప్ప కాదు. ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి ఆ మూవీని చూడటమే బిగ్ ఛాలెంజ్. మేం తీసిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్లు’ నెమ్మదిగా మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో సినిమా బాగుందని రివ్యూలు ఇవ్వడం కూడా ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచాయి. అసలు ప్రేక్షకులను చెడగొట్టింది మేమేలెండీ.. మీరు ఇంట్లో కూర్చోండి. 4 వారాల్లో ఓటీటీకి తెస్తం’ అని థియేటర్‌కు రాకుండా చేసుకున్నం’ అని దిల్‌రాజు అన్నారు. కాగా.. ఓటీటీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ గా మారాయి.
