కొందరు కుట్రపూరిత చరిత్రనే బోధించారు: మోడీ

కొందరు కుట్రపూరిత చరిత్రనే బోధించారు: మోడీ

స్వాతంత్య్రం తర్వాత కూడా కొందరు కుట్రపూరిత చరిత్రను బోధించారని ప్రధాని మోడీ అన్నారు. దేశం వలసవాదాన్ని విడిచిపెట్టి వారసత్వంతో గర్వంగా ఉందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన లచిత్ బర్ఫుకాన్ 400 జయంతి వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. లచిత్ బర్ఫుకాన్‌ 400వ జయంతి సందర్భంగా ఆ పరాక్రమశాలికి నమస్కరిస్తున్నామని అన్నారు.

అస్సాం సంస్కృతిని పరిరక్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని మోడీ తెలిపారు. అంతకుముందు అసోం సీఎంతో కలిసి ఎగ్జిబిషన్ ను సందర్శించారు. సాంస్కృతిక వేడుకలు జరుపుకోవటమే కాదు చారిత్రక నాయకులను స్మరించుకుంటున్నామని మోడీ చెప్పారు.