
నస్పూర్, వెలుగు: సింగరేణి గని కార్మికుల సమస్యలు రాష్ట్ర మంత్రులు, సంస్థ సీఎండీ దృష్టికి తీసుకెళ్లామని శ్రీరాంపూర్ ఏరియా ఐఎన్టీయూసీ నాయకులు అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ.. గని కార్మికుల సమస్యలను మినిమమ్ వేజెస్ చైర్మన్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఈ నెల 8,9 రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎండీ బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
సింగరేణిలో ఐటీ పరిశ్రమ స్థాపించి, సంస్థలో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఉద్యోగులను నియమించాలని, చెన్నూరు గనులను ప్రారంభించి శ్రీరాంపూర్ డివిజన్ జీవితకాలం పెంచాలని, పెర్క్స్‌పై ఇన్ కమ్ టాక్స్ రిఫండ్ చేయాలని, మెడికల్ అన్‌ఫిట్ 24 నెలల నిబంధన తొలగించాలని, సింగరేణి ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమమలు స్థాపించి ఉద్యోగాలు కల్పించాలని, సూపర్ స్పెషాలిటి హస్పిటల్స్ నిర్మాణాలు చేపట్టాలని కోరగా వారు సానుకులంగా స్పందించినట్లు తెలిపారు. సమావేశంలో శంకర్ రావు, కలవేణ శ్యామ్, బరపటి మారుతి తదితరులు పాల్గొన్నారు.