గత పదేళ్ల ఎన్డీఏ పాలనలో పదేళ్లలో పేదలకు 4 కోట్ల పక్కా గృహాలు నిర్మించామని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. బుధవారం (జనవరి 28) ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ముందుగా బిర్సాముండా, సర్దార్ పటేల్ లకు నివాళులు అర్పించారు. అదే విధంగా భారత రత్న భూపేన్ హజారికా శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ముర్ము. గత పదేళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు.
ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పిన రాష్ట్రపతి.. పది కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి పౌరుడికీ జీవిత భీమా కల్పించామని.. ప్రతి పౌరడికీ జీవిత బీమా కల్పించడం లక్ష్యం అన్నారు. 80 వేల ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
పదేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందినట్లు రాష్ట్రపతి తెలిపారు. 150 టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. అదే విధంగా ఆక్వా, పాల ఉత్పత్తులలో దేశం ముందంజలో ఉన్నట్లు తెలిపారు.
