కరోనా వైరస్‌ జన్యు క్రమాన్నిగుర్తించాము: WHO

కరోనా వైరస్‌ జన్యు క్రమాన్నిగుర్తించాము: WHO

ప్రపంచదేశాలకు వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్-19)కు సంబంధించి ఇవాళ(గురువారం) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ఓ ప్రకటన చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యు క్రమాన్ని (జెనటిక సీక్వెన్స్‌) గుర్తించినట్లు WHO  హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌లో టెక్నికల్‌ లీడ్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మారియా వాన్‌ కెర్కోవ్‌ తెలిపారు. వైరస్‌కు సంబంధించిన జెనటిక్‌ విశ్లేషణ జరుగుతోందన్నారు. పాలీమిరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (PCR) తో పాటు సీరాలిజికల్‌ విశ్లేషణను లాబ్స్ లో నిర్వహిస్తున్నామన్నారు. కొత్త వ్యాధిగా మారిన కరోనా వైరస్‌కు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తమ దగ్గర ఉందని కెర్కోవ్‌ చెప్పారు. వైరస్‌ను అతి తక్కువ సమయంలో గుర్తించడం సాధ్యమైయ్యేది కాదన్నారు. వైరస్‌కు చెందిన జన్యు క్రమాన్ని కొన్ని రోజుల క్రితమే షేర్‌ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సిరాలాజికల్‌ రీసెర్చ్ సాగుతుందన్నారు. చైనాతో పాటు బాధిత ప్రపంచ దేశాలు కరోనా పాజిటివ్‌ వ్యక్తుల సీరమ్‌ను పరీక్ష చేయవచ్చునని తెలిపారు.