సార్టప్‌‌‌‌లకు సాయం చేసేందుకు వీ హబ్‌‌‌‌ – సైబర్ వెస్ట్ సైన్ ఎంఓయూ

సార్టప్‌‌‌‌లకు సాయం చేసేందుకు వీ హబ్‌‌‌‌ – సైబర్ వెస్ట్ సైన్ ఎంఓయూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వుమెన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెనూర్లకు సాయం చేస్తున్న వీ హబ్‌‌‌‌ తాజాగా ఆస్ట్రేలియన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సైబర్‌‌‌‌‌‌‌‌ వెస్ట్‌‌‌‌ సైన్‌‌‌‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ ప్రకారం, స్టార్టప్‌‌‌‌లకు ఇరు దేశాల్లో ఉన్న అవకాశాలను ప్రమోట్ చేస్తారు.  ఇండియాలోకి ఎంటర్ అయ్యేందుకు ఆస్ట్రేలియన్ స్టార్టప్‌‌‌‌లకు, ఆస్ట్రేలియాలోకి ఎంటర్‌‌‌‌‌‌‌‌ అయ్యేందుకు ఇండియన్ స్టార్టప్‌‌‌‌లకు  సాయమందిస్తారు. దేశంలో సుమారు 55 వేల స్టార్టప్‌‌‌‌లు యాక్టివ్‌‌‌‌గా ఉండగా, ఆస్ట్రేలియాలో 2,500 స్టార్టప్‌‌‌‌లు యాక్టివ్‌‌‌‌గా ఉన్నాయి.  మార్కెట్‌‌‌‌ అవుట్‌‌‌‌లుక్‌‌‌‌, ఇండస్ట్రీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, రిసోర్స్‌‌‌‌లకు సంబంధించి ఆస్ట్రేలియన్ స్టార్టప్‌‌‌‌లకు ఇండియాలో వీ హబ్‌‌‌‌ ద్వారా సైబర్ వెస్ట్ సైన్ సాయపడుతుంది.

అంతేకాకుండా వీ హబ్‌‌‌‌, సైబర్ వెస్ట్‌‌‌‌ సైన్‌‌‌‌లు కలిసి జాయింట్‌‌‌‌గా వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లను, మెంటరింగ్ సెషన్లను, ఈవెంట్లను నిర్వహిస్తాయి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య  మంచి సంబంధాలు ఉన్నాయని, తమకున్న సామర్ధ్యాలను చక్కగా వాడుకునేందుకు, స్టార్టప్‌‌‌‌లకు అవకాశాలను క్రియేట్ చేయడానికి ఈ భాగస్వామ్యం సాయం పడుతుందని  వీ హబ్‌‌‌‌ సీఈఓ దీప్తి రావుల అన్నారు.  వీ హబ్‌‌‌‌తో పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని, వారికున్న నైపుణ్యాన్ని వాడుకొని ఇండియన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లలో ఆస్ట్రేలియన్ స్టార్టప్‌‌‌‌లు విస్తరించడానికి సాయ పడతామని సైబర్ వెస్ట్ సైన్ సీఈఓ స్టీఫెన్ డాసన్ అన్నారు.