లంక టూర్‌‌లో సంజూను కెప్టెన్‌‌ చేయాలె

లంక టూర్‌‌లో సంజూను కెప్టెన్‌‌ చేయాలె

రెండు సిరీస్‌‌లు ఆడేందుకు రెండు వేర్వేరు టీమ్‌‌లను పంపేందుకు బీసీసీఐ సిద్ధమవతుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానె, ఆర్.అశ్విన్‌తో కూడిన జట్టును ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు పంపనుండగా శ్రీలంక వెళ్లే టీమ్‌‌ను ఇంకా ఎంపిక చేయలేదు. అయితే లంక గడ్డపై వన్డేలు, టీ20లు జరుగనున్నందున యువకులతో కూడిన జట్టును ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఈ టీమ్‌‌కు సీనియర్ లెఫ్టాండర్ శిఖర్ ధవన్ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే లంక గడ్డపై టీమిండియాను డాషింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నడిపిస్తే బాగుంటుందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సూచిస్తున్నాడు. 

‘తదుపరి కెప్టెన్‌ను గుర్తించి అతడు ఎదగడానికి అవకాశాలు కల్పించేందుకు శ్రీలంక టూర్‌‌ టీమిండియాకు బాగా ఉపయోగపడనుంది. అయితే భారత్‌ ముందు ఎక్కువ చాయిస్‌‌లు లేవు. కేవలం ఇద్దరే నాయకత్వం వహించల వారిగా కనిపిస్తున్నారు. అందులో ఒకడు సంజూ శాంసన్. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌కు సంజూ కెప్టెన్సీ చేశాడు. మరో ప్లేయర్ శిఖర్ ధవన్. వన్డేలు, టీ20ల్లో గబ్బకు చాలా అనుభవం ఉంది. అయితే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని నా భావన. అతడు టీమ్‌‌ను బాగా లీడ్ చేయగలడని నా నమ్మకం’ అని కనేరియా పేర్కొన్నాడు. అదే సమయంలో సంజూ కూడా టీమ్‌లో చోటును పదిలపర్చుకునేలా రాణించాలని సూచించాడు.