సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలోని బొక్కల గుట్టలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. బైక్ పై వార్డు,వార్డు తిరుగుతూ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగు నీటికి ఇబ్బంది అవుతోందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వివేక్... సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి త్రాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వివేక్ వెంట వివిధ శాఖల అధికారులున్నారు.