సింగరేణి గనులను ప్రైవేటు కానియ్యం

సింగరేణి గనులను ప్రైవేటు కానియ్యం
  • ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్

హైదరాబాద్‌, వెలుగు: సింగరేణి బొగ్గు గనులతో పాటు దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, దేశం మొత్తంమీద ప్రభావం చూపుతుందని అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించి మొత్తం బొగ్గు తవ్వేస్తే భవిష్యత్‌ తరాలకు బొగ్గు లేకుండా పోతుందన్నారు.

యూపీ ఎన్నికల కోసమే విద్యుత్‌ చట్టాలను కేంద్రం పార్లమెంట్‌ ముందుకు తేలేదని ఆరోపించారు. కోల్ బ్లాక్‌ల ప్రైవేటీకరణపై తమతో కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమిస్తామన్నారు. కేంద్రం అన్ని ప్రభుత్వరంగం సంస్థలను ప్రైవేటుపరం చేసి ఆర్థికంగా లాభం పొందాలని చూస్తోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సింగరేణి గనులను విస్తరిస్తున్న టైంలో కేంద్రం ప్రైవేటీకరించుడేందని ప్రశ్నించారు. సింగరేణి కోల్‌ బ్లాకుల వేలాన్ని నిలిపివేయించాలని రాష్ట్ర బీజేపీ ఎంపీలకు సూచించారు.