- సినిమా స్టార్స్‌తో ఈ చీరల ప్రచారం చేయిద్దాం..
- బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్‌రావు
మహబూబ్‌నగర్, వెలుగు: నారాయణపేట జిల్లా కోటకొండ చేనేతకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్ రావు తెలిపారు. నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామాన్ని సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణతో కలిసి సందర్శించారు.
పార్టీ నారాయణపేట జిల్లా మాజీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు నివాసంలో తయారు చేసిన చేనేత వస్త్రాలు, గద్వాల్, పైతాన్, సికో, తదితర రకాల పట్టు చీరలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటకొండ చేనేత కార్మికుల కళ అత్యద్భుతమని ప్రశంసించారు. కోటకొండలో పంచలు తయారు చేసి విక్రయించాలని సూచించారు.
ఆ పంచలకు కోటకొండ బ్రాండ్ తీసుకురావాలన్నారు. ఇక్కడ నేసే చీరలకు సినిమా స్టార్స్‌తో ప్రచారం చేద్దామన్నారు. కోటకొండలో లేదంటే హైదరాబాద్‌లో షో ఏర్పాటు చేయాలని సూచించారు. స్వదేశీని ఆదరించడం.. చేనేతను అక్కున చేర్చుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం ఓ వివాహ వేడకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ఎగ్గని నర్సింహులు ఉన్నారు.
