ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా చర్లగూడెం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఈ నెల 16న పాదయాత్ర నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఇందులో భాగంగా శివన్నగూడెం పైలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మర్రిగూడ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు యాత్ర కొనసాగిస్తామన్నారు. నల్గొండ జిల్లా చండూరులో సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకుస్థాపన టైంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి రూ. 6 వేల కోట్లు కేటాయించలేని ప్రభుత్వం కాళేశ్వరం కోసం రూ. 80 వేల కోట్లు ఎలా ఖర్చు చేసిందని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలోనే ఇక్కడి నిర్వాసితులకు కూడా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సమావేశంలో మర్రిగూడ, చండూరు మండల పార్టీ అధ్యక్షులు దోమల వెంకన్న, ఎర్రజల్ల లింగయ్య, నల్ల సత్యనారాయణ, బీసీ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కార్యదర్శి, పగడాల లింగయ్య, పుప్పాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

రూ.5 వేల కోట్లు కేటాయించాలి

రాజాపేట, వెలుగు : కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 5 వేల కోట్లు కేటాయించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి బొలగాని జయరాములుగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. యాదాద్రి జిల్లా రాజాపేటలో సోమవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్న జీవోను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. గీత కార్మికులకు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. గీత కార్మికులకు గీతన్న బంధు  ఇవ్వాలని, ప్రతి జిల్లాకు ఒక నీరా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీపీ బాలమణిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాండవుల లక్ష్మణ్, మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేదారి, బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

సూర్యాపేట, వెలుగు : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ అధ్వర్యంలో సోమవారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డు నుంచి వాణిజ్య భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు స్టూడెంట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 3,600 కోట్ల స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందన్నారు. ప్రభుత్వం స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేయకపోవడంతో స్టూడెంట్లు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని, హాస్టళ్లకు సొంత బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ఎర్ర అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లా కోశాధికారి పల్లపు ఈశ్వర్, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హుస్సేన్, రాణి, మంజుల, కృష్ణ పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనాన్ని సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి

చండూరు/మర్రిగూడ, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు, మర్రిగూడలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి నల్గొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు గ్రామాలను కలిపి నిర్వహించే టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆత్మీయ సమ్మేళనానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నల్గొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే చండూరు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 15వ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులు రూ. 55 లక్షలతో ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్లు, పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 

పరిసరాలను క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంచాలి

యాదాద్రి (వలిగొండ), వెలుగు : యాదాద్రి జిల్లా వలిగొండలోని సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీఈవో నారాయణరెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంచాలని స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని పాఠాలు చెప్పాలని సూచించారు. అనంతరం స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడారు. 

సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

సూర్యాపేట/నల్గొండ, వెలుగు : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఉత్సవాల కోసం తుంగతుర్తి నియోజకవర్గానికి అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్.మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సూర్యాపేటకు ఆర్డీవో రాజేంద్రకుమార్, కోదాడకు ఆర్డీవో కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆర్డీవో వెంకారెడ్డిని స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లుగా నియమించినట్లు చెప్పారు. సెప్టెంబర్16న ర్యాలీ, 17న జాతీయ జెండావిష్కరణ, 18న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకోసం సద్దల చెరువు వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్.మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, జడ్పీ సీఈవో సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్డీవోలు పాల్గొన్నారు. అలాగే  సమైక్యతా ఉత్సవాల నిర్వహణపై నల్గొండ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపీడీవోలు, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విద్యాశాఖ ఆఫీసర్లతో వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 16న లక్ష్మీ గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ, డీఈవో భిక్షపతి, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

వజ్రోత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే రివ్యూ

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలపై సోమవారం నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా 16న నిర్వహించబోయే కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జన సమీకరణ, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ పుష్పలత, నల్గొండ డీఎస్పీ రమేష్, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీడీవో రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దయాళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ఎస్సై రామకృష్ణ  పాల్గొన్నారు.

నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీలు పెంచాలి

పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీల సంఖ్య పెంచాలని సూర్యాపేట డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో కోట చలం సూచించారు. పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీని సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గర్భిణుల వివరాలు సేకరించి, వారు ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డెలివరీ అయ్యేలా చూడాలన్నారు. సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షవర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, డాక్టర్లు మణిదీప్, సాధిక, బిందు, హరిప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాళం

చండూరు (మర్రిగూడ), వెలుగు : ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలంటూ రాంరెడ్డిపల్లి, కుదాభక్షపల్లి, శివన్నగూడెం నిర్వాసితులు సోమవారం మునుగోడు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేటుకు తాళం వేశారు. గేటు ఎదుట బైఠాయించి సిబ్బంది లోపలికి పోకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూములు కోల్పోయిన వారందరికీ న్యాయం చేస్తానని చెప్పిన ఆఫీసర్లు ఇప్పుడు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. భూములు కోల్పోయిన వారందరికీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ, రంగారెడ్డి జిల్లాలో ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్డీవోలు రావాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్వాసితులతో మాట్లాడి సర్ది చెప్పడంతో గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాళం తీశారు.

స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్లై చేసుకోండి

యాదాద్రి, వెలుగు : దివ్యాంగ విద్యార్థులకు కేంద్రం అందజేస్తున్న స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అర్హులైన వారు అప్లై చేసుకోవాలని యాదాద్రి వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణవేణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రీ మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కొత్తగా అప్లై చేసుకునే వారితో పాటు, ఇప్పటికే అప్లై చేసుకున్న వారు ఈ నెల 31 లోగా రెన్యూవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు https://scholarships.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూడాలని పేర్కొన్నారు.

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పరారీలో మరో ఐదుగురు

యాదాద్రి, వెలుగు : చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం భువనగిరి పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి, సీఐ సత్యనారాయణ వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన ఓలేటి మహాచలరావు అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాలక్ష్మి 2017 నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అదే ఏడాది గొల్లపాలెం, 2018లో కోరంగి పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో రెండేళ్ల పాటు జైలులో ఉండి తర్వాత విడుదల అయ్యాడు. 2020 నుంచి తెలంగాణలో ఉంటూ రాచకొండ, సైబరాబాద్, నల్గొండ పరిధిలో 21 దొంగతనాలు చేశాడు. 2021లో చిట్యాల పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈ టైంలోనే యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన గజ్జల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో పరిచయం అయింది. జైలు నుంచి బయటకు వచ్చిన మహాచలరావు తిరిగి ఉభయ గోదావరి జిల్లాల్లో చోరీలు చేస్తుండడంతో ఐ పోలవరం పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రాజమండ్రి సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలుకు తరలించారు. అక్కడి నుంచి తప్పించుకొని తెలంగాణకు వచ్చిన శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గతంలో పరిచయమైన రామిడి రామాంజనేయులుతో పాటు, మరో నలుగురితో కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. సోమవారం భువనగిరి పోలీసులు నల్గొండ రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండడంతో అటువైపు వచ్చిన మహాచలరావు, గోపె వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయడంతో చోరీల విషయం బయటపడింది. వారిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు రూ. 50 వేలు, మూడు టూ వీలర్స్, 19 సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మహాచలరావుపై మొత్తం 62 కేసులు ఉన్నాయి. ఇంకా కల్యాణపు ఫణీంద్రసాయి, రామిడి రామాంజనేయులు, గోపె అక్షయకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గజ్జల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గోపే సాయికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉన్నారని డీసీపీ చెప్పారు. 

దాతల సాయంతో సీసీ కెమెరాలు పెట్టాలి

యాదాద్రి, వెలుగు : పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం గుర్తించిన సెంటర్లలో దాతల సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె మాట్లాడారు. అక్టోబరు 16న జరిగే గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -1 ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 3,645 మంది హాజరుకానుండగా, జిల్లాలో 62 సెంటర్లను గుర్తించినట్లు చెప్పారు. 18 ప్రభుత్వ, 17 ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లలో సీసీ కెమెరాలు లేనందున దాతల సాయంతో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏసీసీ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఈవో నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మఠంపల్లి మండలం బాడవతండాకు చెందిన బానోతు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (25) ఓజో ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పడుకున్నాడు. సోమవారం ఉదయం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉరి వేసుకొని కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని బంధువు బానోతు శ్రీను ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కట్టా వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.

వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాపులో మద్యం బాటిళ్లు చోరీ

కోదాడ, వెలుగు : వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాపులో మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా చిలుకూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిలుకూరులోని బేతవోలు రోడ్డులో ఉన్న సాయిబిందు వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదివారం రాత్రి నిర్వాహకులు మూసి వెళ్లారు. తర్వాత కొందరు గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాళలు పగులగొట్టి లోపలికి వెళ్లారు కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబ్బులు లేకపోవడంతో రూ. 2 లక్షల విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం షాపు తీసిన వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్లు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాపు యజమాని వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

పథకాలు నచ్చే పార్టీలో చేరుతున్రు

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం దామెర గ్రామానికి చెందిన పలువురు కూసుకుంట్ల ఆధ్వర్యంలో సోమవారం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారెడ్డి అండాలు, గ్రామ అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నారెడ్డి అభినందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సతీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బొడ్డు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

మోటకొండూరు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో 24 గంటలు వైద్యసేవలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా మోటకొండూరు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో 24 గంటలు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం అదనపు స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటాయిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు స్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నర్సులతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఇద్దరు కాంటిజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కర్లను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ద్వారా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. వర్చూసా కంపెనీ, యునైటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఆవరణలో ఇటీవల 30 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించారు. కానీ సిబ్బంది లేకపోవడంతో ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరుపయోగంగా మారింది. దీంతో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీని 24 గంటల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చాలని, అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరుతూ ఇటీవల ఆలేరు ఎమ్మెల్యే, విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును కోరారు. స్పందించిన మంత్రి మోటకొండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీని 24 గంటల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చడంతో పాటు, వైద్య సిబ్బందిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రులు జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీత కృతజ్ఞతలు తెలిపారు.

సూర్యాపేట, యాదాద్రి డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : యాదాద్రి, సూర్యాపేట జిల్లాల ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. యాదాద్రి డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో డి.వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా, ఆయన స్థానంలో వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న పద్మజారాణిని నియమించారు. అలాగే సూర్యాపేట జిల్లా ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముకుందారెడ్డి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఆయన స్థానంలో సత్తుపల్లి డివిజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న వేమూరి సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సూర్యాపేటకు రానున్నారు.

ఎనిమిదేండ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయలే

యాదాద్రి, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిదేండ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య విమర్శించారు. కొలనుపాక సోమేశ్వర ఆలయంలో సోమవారం పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. కొలనుపాక, రాఘవపురం, శ్రీనివాసపురం, పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడెం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంధమల్ల, తపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. ఇక్కడికి రావాల్సిన నీటిని మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తరలించుకు పోతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలనుపాక వాగుపై వంతెన కట్టలేక పోయారని, యువతకు ఉపాధి చూపించలేకపోయారని విమర్శించారు. మహిళా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షురాలు  నీలం పద్మ, జనగాం ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ చీర శ్రీశైలం ఉన్నారు.  

నిరుద్యోగులు ఓటేయకున్నా లబ్ధిదారుల ఓట్లతో గెలుస్తం

యాదాద్రి, వెలుగు : ‘ఉద్యోగాలు రాలేదని కొందరు వ్యతిరేకించినప్పటికీ పింఛన్లు, రైతు బంధు లబ్ధిదారుల ఓట్లతోనే మునుగోడులో గెలుస్తాం’ అని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. భువనగిరిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బలంగా ఉన్న వామపక్షాల మద్ధతుతో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు. మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిపై మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు సరికాదని, పార్టీలో ఎవ్వరినీ పక్కన పెట్టలేదన్నారు. టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశించడం తప్పు కానప్పటికీ మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడ్డం కరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతోందన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. సమావేశంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ అధ్యక్షుడు ఎడ్ల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చింతల కిష్టయ్య, జనగాం పాండు పాల్గొన్నారు.