
హుస్నాబాద్/కోహెడ, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ మండలంలోని పందిల్ల, పోతారం(ఎస్) గ్రామాల్లో స్ట్రీట్ లైట్స్ పనులను బుధవారం రాత్రి ప్రారంభించారు. ముల్కనూర్, కొత్తపల్లి, ఎల్కతుర్తిల్లో త్వరలోనే కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. హుస్నాబాద్–-కరీంనగర్ ఫోర్లేన్రహదారి పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. బస్వాపూర్, సముద్రాల గ్రామాల్లో నేషనల్ హైవే పై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.