ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం : గడ్డం వంశీకృష్ణ

 ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం :  గడ్డం వంశీకృష్ణ

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు.  ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.  మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వంశీ.  

గూడెం సత్యనారాయణ ఆలయ సాక్షిగా మండలాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు వంశీకృష్ణ.  దండేపల్లి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సలహాలు తీసుకుని  సేవకుడు లా పని చేస్తానన్నారు.  గడిచిన పదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని.. కాంగ్రెస్ హయాంలోనే రేషన్ కార్డులు ఇచ్చినట్లుగా గుర్తుచేశారు.  బీఆర్ఎస్ పాలన లో అక్రమ కేసులు, భూ దందా,ఇసుక దందా లకు పాల్పడ్డారని..ఇవ్వన్ని ప్రజలు గమనించాలని కోరారు.  సేవ చేసే వారికే ఓటు వేసి గెలిపించాలన్నారు వంశీ.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.  

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ  యువకుడైన వంశీని గెలిపించాలని కోరారు.  మంచిర్యాల నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ ఇస్తామని - ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.