దుబ్బాకలో గులాబీ జెండా ఎగరేస్తాం: మంత్రి హరీష్

దుబ్బాకలో గులాబీ జెండా ఎగరేస్తాం: మంత్రి హరీష్

దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా ఈ ప్రాంతం మీద సీఎం కేసీఆర్ కి ఎంతో ప్రేమ ఉందని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. పెంచిన సిలిండర్ ధర ఎప్పుడు తగ్గిస్తారని ప్రశ్నించారు. రూ. 400 ఉన్న సిలిండర్ ను రూ. 1200 కి పెంచారని, పంచుడు BRS వంతు..పెంచుడు BJP వంతు అంటూ ఎద్దేవా చేశారు. దుబ్బాకలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్​, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఉన్న ఉద్యోగాలు తీసేయడం,  ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ చేస్తారని విమర్శించారు. 

‘బీజేపీ వాళ్ళు మాయమాటలు చెప్పగానే ఒకసారి మోసపోతాం.. మళ్ళీ మోసపోతమా..మంచి ఏదో చేడు ఏదో మీకు తెలుసు. దుబ్బాక బస్టాండ్ చూస్తే కడుపు నిండింది. దుబ్బాకకు బస్టాండ్ ఎంపీ ప్రభాకర్ ఆడిగిండు. గోవర్ధన్ ఇచ్చిండు. పాడి ఆవుల గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ పై బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తారు. గోవుని, సైనికులని రాజకీయం కోసం వాడుకునే చరిత్ర బీజేపీది’ అంటూ వెల్లడించారు.