తీన్మార్ మల్లన్న ప్రజా సమస్యలపై మాట్లాడుతరు.. ఆయనకే మా మద్దతు : అలుగుపల్లి నర్సిరెడ్డి

తీన్మార్ మల్లన్న ప్రజా సమస్యలపై మాట్లాడుతరు.. ఆయనకే మా మద్దతు : అలుగుపల్లి నర్సిరెడ్డి

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మద్దతుగా తామున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి అన్నారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని, లౌకిక విలువలను రక్షించుకుంటామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రజా సమస్యలపై మాట్లాడేవారని చెప్పారు. నల్లగొండ జిల్లాలో అలుగుపల్లి నర్సిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు ఆదరించొద్దని ససూచించారు.  దేశ ప్రధాని నోట్ల రద్దు చేశారని వాటితో ఎవరికి మేలు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మే 27వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి గ్రాడ్యుయేట్  పాల్గొని తీన్మార్ మల్లన్నకు ఓటు వేయండని సూచించారు అలుగుపల్లి నర్సిరెడ్డి.