మన పైలట్ మిస్ కావడం బాధగా ఉంది: రాహుల్

మన పైలట్ మిస్ కావడం బాధగా ఉంది: రాహుల్

కీలక సమయంలో భద్రతా దళాలకు అండగా ఉంటామన్నారు రాహుల్ గాంధీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ మిస్ అవడంపై విచారం వ్యక్తం చేశారు. పైలట్ సురక్షితం తిరిగిరావాలని.. తిరిగి వస్తాడని ఆశిస్తున్నామన్నారు. పైలట్ విషయంలో పాక్ అమానుషంగా ప్రవర్తించడాన్ని ఖండించారు.

పాక్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఇలాంటి సమయంలో జాతి ప్రయోజనాలు పణంగా పెట్టకూడదన్నారు.

తాజా పరిణామాలపై బుధవారం పార్లమెంట్ లైబ్రరీ సెంట్రల్ హాలులో సమావేశమైన 21 బీజేపీయేతర పక్షాలు పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించాయి. దేశానికి అండగా ఉంటామని ప్రతిపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. త్వరలో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. భద్రతా దళాల త్యాగాన్ని రాజకీయం కోసం వాడుకోవడాన్ని ఖండించాయి.

నిన్న బాలాకోట్ టెర్రర్ క్యాంప్ పై వాయుసేన దాడులను ప్రశంసించాయి విపక్ష పార్టీలు. మరోవైపు భారత సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు విపక్ష నేతలు. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, మన్మోహన్, మమతా బెనర్జీ, శరద్ పవార్, చంద్రబాబు నాయుడు సహా పలు పార్టీల సీనియర్ నేతలు హాజరయ్యారు.