వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ రివ్యూ

టైటిల్ : మీట్ క్యూట్
డైరెక్షన్ : దీప్తి గంటా
కాస్ట్ : వర్ష బొల్లమ్మ, రుహానీ శర్మ, రాజా, ఆకాంక్ష సింగ్, దీక్షిత్​, శివ కందుకూరి, సంచిత, గోవింద్
లాంగ్వేజ్ : తెలుగు, రన్​ టైం : ఐదు ఎపిసోడ్లు (ఒక్కో ఎపిసోడ్ అరగంట)
ప్లాట్​ ఫాం : సోనీ లివ్

‘మీట్ క్యూట్’​ ఒక ఆంథాలజీ వెబ్ సిరీస్​. ఇందులో ఐదు కథలున్నాయి. వాటిలో స్వాతి (వర్ష బొల్లమ్మ) సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్. అప్పటికే పది సంబంధాలు రిజెక్ట్ చేసిన స్వాతికి, పేరెంట్స్​ బలవంతంగా అభితో రెస్టారెంట్​లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. మరి స్వాతి పెళ్లికి ఓకే చెప్పిందా? లేదా? అనేది ‘మీట్​ ద బాయ్’ స్టోరీ. సరోజ (రుహానీ శర్మ) తన ఫ్రెండ్స్​తో కలిసి వెకేషన్​కి వెళ్లాలనుకుంటుంది. అది భర్త జై (రాజా)కి నచ్చదు. కానీ, చెప్పలేకపోతుంటాడు. ఆ టైంలో సరోజ, మోహన్​రావు (సత్యరాజ్) ఒకరికొకరు పరిచయమవుతారు. ఆ తర్వాత ఆమె లైఫ్​ ఎలా మారిందనేది ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’. 

పూజ (ఆకాంక్ష సింగ్), సిద్ధార్థ్ (దీక్షిత్​) ప్రేమికులు. ఒకసారి వీళ్లిద్దరూ సిద్ధూ వాళ్ల అమ్మ పద్మ (రోహిణి) కంటపడతారు. పద్మకి, పూజ పరిచయమయ్యాక కొన్ని నిజాలు తెలుస్తాయి. అవేంటో తెలుసుకోవాలంటే ‘ఇన్​ లా’ చూడాలి. ఒక వర్షం కురిసిన రాత్రి హీరోయిన్​ శాలిని (అదా శర్మ), డాక్టర్​ అమన్ (శివ) అనుకోకుండా కలుస్తారు. వాళ్లిద్దరూ తమ అభిరుచుల గురించి మాట్లాడుకుంటారు. అదే ‘స్టార్స్ టాక్’. 

అరేంజ్డ్ మ్యారేజ్​తో ఒక్కటైన అంజన (సంచిత), అజయ్ (గోవింద్) మధ్య మాటలు పెద్దగా ఉండవు. ఒకరి గురించి మరొకరికి తెలియకపోవడంతో విడిపోవాలి అనుకుంటుంది అంజన. అప్పుడు, అజయ్ ‘ఎక్స్​గర్ల్​ ఫ్రెండ్’ అతడి గురించి అంజనకు చెప్తుంది. తర్వాత ఏమైందనేది మిగతా కథ. ఓవరాల్​గా ఈ సిరీస్​లో సినిమాటోగ్రఫీ, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్, ప్రొడక్షన్​ వ్యాల్యూస్​, నటీనటుల నటన బాగున్నాయి. కథ, కథనం, డైలాగ్స్​ నాట్ సో క్యూట్​. డెబ్యూ డైరెక్టర్​గా దీప్తి ఓకే.​ 


***********

ఇన్వెస్టిగేటివ్  థ్రిల్లర్

టైటిల్ : చుప్​ – రివేంజ్​ ఆఫ్​ ది ఆర్టిస్ట్, డైరెక్షన్ : ఆర్​. బాల్కీ
కాస్ట్ : దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి, పూజా భట్, సన్నీ డియోల్, లాంగ్వేజ్ : హిందీ, తెలుగు, రన్​ టైం : 2:15 గంటలు
ప్లాట్​ ఫాం : జీ5

‘సీతారామం’తో తెలుగులో మంచి హిట్​ అందుకున్నాడు మలయాళ నటుడు దుల్కర్​. రీసెంట్​గా హిందీలో ‘చుప్’​ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్​ థ్రిల్లర్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ కథ విషయానికొస్తే.. ముంబైలో వరుస హత్యలు జరుగుతుంటాయి. చనిపోయిన వాళ్లంతా ఫిల్మ్​ క్రిటిక్స్. ఆ హత్యకేసుల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి క్రైమ్​ బ్రాంచ్​ నుంచి అరవింద్​ (సన్నీ డియోల్) అనే పోలీస్ ఆఫీసర్​ వస్తాడు. అరవింద్​, ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాడన్నదే కథ. మరోవైపు గురుదత్​ ఫ్యాన్​ అయిన ఫ్లోరిస్ట్ డానీ (దుల్కర్), జర్నలిస్ట్ నీలా మీనన్ (శ్రేయా ధన్వంతరి) మధ్య లవ్​ ట్రాక్ నడుస్తుంటుంది. అయితే, క్లైమాక్స్​లో ఈ జంట హత్యలతో కనెక్ట్ అవుతుంది. ఈ కథలో ఆ హంతకుడు ఎవరు? ఫిల్మ్​ క్రిటిక్స్​నే ఎందుకు టార్గెట్​ చేశాడు? అతడి ఉద్దేశం ఏంటి? అనేది తెలియాలంటే ‘చుప్​’ చూడాల్సిందే. ‘పా’, ‘షమితాబ్’, ‘ప్యాడ్ మ్యాన్’ వంటి వెరైటీ స్టోరీస్​ తీసిన ​డైరెక్టర్ బాల్కీ, ‘చుప్​’లోనూ తన మార్క్​ చూపించాడు. ఇందులో దుల్కర్​ నటన ప్లస్ ​పాయింట్. మిగతా క్యారెక్టర్స్​ తమ పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్​ బాగున్నాయి. 


***********

బీహార్​ పోలీస్​ స్టోరీ

టైటిల్ : ఖాకీ – ది బీహార్ చాప్టర్, డైరెక్షన్ : భవ్​ ధులియా
కాస్ట్ : కరణ్ థాకర్, అవినాశ్ తివారి, నిఖిత దత్తా, రవి కిషన్, అభిమన్యు సింగ్, శ్రద్ధా దాస్ లాంగ్వేజ్ : హిందీ, తెలుగు 
రన్​ టైం : ఏడు ఎపిసోడ్లు (ఒక్కోటి దాదాపు గంట)
ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్ 

ఈ సిరీస్​ 2000 నుంచి 2006 మధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగా తీశారు. కథలోకి వెళ్తే.. చందన్​ (అవినాశ్ తివారి) బీహార్​లో మోస్ట్ వాంటెడ్​ క్రిమినల్. విలేజ్​ కుర్రాడు అక్రమాలకు పాల్పడుతూ గ్యాంగ్​స్టర్​గా ఎదుగుతాడు. అతడు కనిపిస్తే కాల్చేసేందుకు రెడీ ఉంటారు పోలీసులు. కానీ, రాజకీయ నాయకులు, కొందరు పోలీస్​ ఆఫీసర్స్​ సపోర్ట్​తో తప్పించుకుంటుంటాడు. అలా పోలీస్​ ఇన్​ఫార్మర్​గా పనిచేసేవాళ్లని కూడా మర్డర్​ చేస్తాడు. అదలా ఉండగా.. అప్పుడే ట్రైనింగ్ కంప్లీట్ చేసి, ఐపీఎస్​గా బాధ్యతలు తీసుకుంటాడు అమిత్​ లోధా (కరణ్​ థాకర్). అతని శక్తి సామర్థ్యాలు తెలిసిన అధికారులు, చందన్​ని పట్టుకోమని అమిత్​కి ఆర్డర్స్​ ఇస్తారు. అమిత్​, చందన్​ను పట్టుకునే క్రమంలో ఎలాంటి ఛాలెంజ్​లు ఎదుర్కొన్నాడు? చందన్​ని పట్టుకున్నాడా? లేదా? అనేదే మిగతా స్టోరీ.

ఈ సిరీస్​లో చందన్ మాతో, అమిత్ లోధా మధ్య ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. బీహార్ బ్యాక్​ డ్రాప్​, గ్యాంగ్​స్టర్ , పోలీస్ మధ్య నడిచే కథ ఇంట్రెస్టింగ్​గా ఉంటుంది. ముఖ్యంగా పోలీస్​ కథలు ఇష్టపడేవాళ్లకు ఈ సిరీస్​ నచ్చుతుంది. కాకపోతే రన్ టైం చాలా ఎక్కువ.