వార ఫలాలు నవంబర్ 5 నుంచి 11 వరకు

వార ఫలాలు నవంబర్ 5 నుంచి 11  వరకు

మేషం 

కార్యక్రమాలలో ఆటంకాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. కష్టం తప్ప ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. రాబడి తగ్గి అప్పులు చేయాల్సివస్తుంది. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.  వ్యాపారులకు లాభాలు స్వల్పంగా ఉండవచ్చు. ఉద్యోగులకు గందరగోళ పరిస్థితి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకం. కళాకారులు, క్రీడాకారులకు కొత్త సమస్యలు. వారాంతంలో ఆకస్మిక ధనలాభం. వాహనసౌఖ్యం.

వృషభం 

ముఖ్యమైన కార్యాలు కొన్ని విజయవంతం. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కారం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి. రావలసిన సొమ్ము కొంత అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. కుటుంబంలో మీ మాటే చెల్లుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనే అవకాశం. యుక్తితో సమస్యల పరిష్కారం. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులు అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.

మిథునం

కొంతకాలంగా చికాకు పరుస్తున్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. అనుకూల వాతావరణం మధ్య ముందడుగు వేస్తారు. చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం అనుకున్న మేర సమకూరుతుంది.  భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరం. కళాకారులు, క్రీడాకారులకు కొంత ఉపశమనం.

కర్కాటకం

రాబడి సంతృప్తికరం. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రచన, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబసభ్యుల సహకారంతో  కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. కొన్ని నిర్ణయాలు పునఃపరిశీలిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొత్త ఆశలు. మీ తెలివితేటలకు పదును పెడతారు. వ్యాపారులు పెట్టుబడులు పెంచుకుంటారు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులు, పరిశోధకులు, క్రీడాకారులకు కార్యసిద్ధి.

సింహం

యత్నకార్యసిద్ధి. స్నేహితులు చేదోడుగా నిలుస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. రాబడికి లోటు రాకుండా ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారం సానుకూలమయ్యే సూచనలు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు. వ్యాపారులకు కొత్త వ్యాపారాల ఏర్పాటులో విజయం. ఉద్యోగులు విశేష ప్రతిభ కనబరుస్తారు. కళాకారులు నూతనోత్సాహం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు  వివాదాల పరిష్కారం.

కన్య

కార్యక్రమాలలో విజయం. విలువైన వస్తువులు, స్థలాలు కొంటారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. కొన్ని వివాదాలు ఎవరి ప్రమేయం లేకుండానే పరిష్కారం. వాహనసౌఖ్యం.  దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఆశించిన ఆదాయం. దీర్ఘకాలిక  రుణబాధల నుంచి విముక్తి. వ్యాపారులకు భాగస్వాముల సహకారం.  ఉద్యోగులకు విధుల్లో సమస్యలు తీరతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

తుల 

ప్రతి వ్యవహారంలోనూ నిదానం ముఖ్యం.  భూ సంబంధిత వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. విచిత్రమైన సంఘటనలు. వాహన కొనుగోలు యత్నాలు  వాయిదా. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. ఆదాయం కంటే ఖర్చులు అధికం. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ, పారిశ్రామికవర్గాల వారు శ్రమకోర్చాల్సిన సమయం. పరిశోధకులు, శాస్త్రవేత్తలకు అంచనాలు కొన్ని తప్పుతాయి. వారాంతంలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. 

వృశ్చికం 

అతిథుల ద్వారా ముఖ్య సమాచారం. ఇంటా బయట చికాకులు. ఆలోచనలు కలసిరాక నిరాశ. ప్రత్యర్థులతో సర్దుబాటు వైఖరి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. కొన్ని వివాదాలు ఇబ్బందిగా మారవచ్చు. వ్యాపారులు పెట్టుబడుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కళాకారులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. క్రీడాకారులు, వ్యవసాయదారులకు ఊరట లభిస్తుంది. వారారంభంలో చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు.

ధనుస్సు 

ఏ  కార్యం  చేపట్టినా విజయమే. ఆప్తులు మరింత దగ్గరవుతారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శుభకార్యాలకు సమాయత్తమవుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని ఆరోగ్యసమస్యలు తీరతాయి. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల సమయం.

మకరం

కష్టం మీది, ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వాహనాలు, ఆభరణాలు జాగ్రత్త. ఆదాయం తగ్గి అప్పులు కోసం యత్నిస్తారు. ఇతరులకు హామీల  విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొన్ని వ్యవహారాలలో పట్టువిడుపుఉండాలి. సోదరులు, స్నేహితులతో స్వల్ప విభేదాలు. వ్యాపారులకు కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు  నిరుత్సాహం.

కుంభం

మీ కృషి  ఫలించి ముందడుగు వేస్తారు. ప్రత్యర్థులు స్నేహితులుగా  మారతారు. ఆలోచనలకు కార్యరూపం. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం ఆశాజనకం. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరతాయి. వైద్యులు, పరిశోధకులకు ఆహ్వానాలు.

మీనం

కొన్ని వ్యవహారాలలో మీదే పైచేయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. బాకీలు కొన్ని అందుతాయి. రుణాలు తీరతాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి నుంచి పిలుపు రావచ్చు. కళాకారులు, రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య  పండితులుఫోన్​: 98852 99400