
పెళ్లికో.. పేరంటానికో పోవడానికి పదిరోజుల ముందు బరువు గుర్తుకొస్తది.ఇగ వెంటనే కీటో డైట్ , మధ్య మధ్యల ఉపవాసాలు మొదలుపెడ్తరు. బరువుతగ్గాలనుకోవడం చిన్న గోలేం కాదు. ఇట్లకోరుకోంగనే కొవ్వంతా కరిగిపోవడానికి! దీనికిహార్డ్ వర్క్ చెయ్యాలె. సంకల్పం చేసుకోవాలె.ఒళ్లు మొత్తం ఓపికను నింపుకోవాలె.బరువు తగ్గడం మెల్లిగా.. ఒక పద్ధతి ప్రకారం జరగాల్సిన ప్రక్రియ. కానీ, ఈ మోడ్రన్‌జనాలు ‘ఇన్ స్టంట్ ’కు అలవాటువడ్డరు. ఏ పనైనా అనుకోంగనే అల్కగ అయిపోవాలె.అందుకే నెల రోజుల్లో హిందీ..తమిళం లాగా..ఏడు రోజుల్లోనే బరువు తగ్గేందుకు కూడా..కొత్త కొత్త డైట్ లు పుట్టుకొస్తున్నయ్ . వాటికేమస్తు క్రేజ్ ! ఈ డైట్ లలో ఎక్కువగా విదేశాల నుంచి అరువు తెచ్చుకున్నవే. అయితే, దేశీ ఆహారంతో కూడిన డైట్ తో ఏడు రోజుల్లో బరువు తగ్గొచ్చు. అది కూడా ఆరోగ్యంగా !ఇప్పుడు చాలా మంది మన ‘దేశీ డైట్ ’ వైపుమళ్లుతున్నరు. ‘ బరువు తగ్గించు కోవడానికిమందులు, ఆపరేషన్లు అవసరం లేదు. మన దగ్గర పండిస్తున్న వాటితోనే తిరిగి మునుపటి శరీరాకృతిని తీసుకురావచ్చు’అని అంటున్నరు న్యూట్రిషన్ నిఖితా అగర్వా ల్ .‘అయితే వాటిని ఒక పద్ధతి ప్రకారం తినాలె’అంటారామె.
సుగంధ ద్రవ్యాలతో
ప్రపంచానికి సుగంధ ద్రవ్యాల్నిపరిచయం చేసిందే మనదేశం. ఈ మసాలాలు కేవలం ఆహారానికి సువాసనల్ని దట్టిం చడమేకాదు.. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సాయపడ్తయ్ .వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు , యాంటీ ఇన్‌ఫ్లెమెటరీ ఆయిల్స్ కొవ్వు తో యుద్ధం చేస్తయ్ .అంతేనా.. ఈ మసాలాలన్నీ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తయ్ . గ్యాస్ , ఎసిడిటీ, కడుపు వాపు వంటి సమస్యలు కూడా ఈసుగంధ ద్రవ్యాలతో దూరమైతయ్ .
పచ్చళ్లతో..
ఊరేసిన పచ్చళ్లలో అధిక స్థాయిల్లో యాంటి యాక్సిడెంట్లు , ఫైబర్‌లు ఉంటయ్ . ముఖ్యంగా
కూరగాయాలతో ఊరేసిన పచ్చళ్లలో ఉండేమంచి బ్యాక్టీరియాకు విషపూరిత పదార్థాలను తొలగించే శక్తి ఉంటది. ఇవి ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఉపయోగపడ్తయ్ .
షర్బత్ , ఉసిరితో
నిమ్మకాయతో తయారు చేసిన షర్బత్ ,ఉసిరికాయ రసాల్లో విటమిన్ ‘సి’ ఉంటది.విటమిన్ ‘సి’ కి కొవ్వు ని కరిగిం చే శక్తి ఉంటది.గ్యాస్ తో కూడిన కృత్రిమ కూల్ డ్రింక్స్‌కి ఇవిహెల్దీ ప్రత్యామ్నాయాలు.
గింజలు పప్పులు
దేశంలో ఎక్కువ మంది తినేవి పప్పులు, చిక్కుడుజాతి పదార్థాలే. చిక్కుడులో ఉండే ఫైబర్‌లు(పీచు పదార్థా లు) బరువు తగ్గిం చడానికి సాయపడ్తయ్ . నువ్వులు, పొద్దు తిరుగుడుగింజలు, వాల్ నట్స్, పైన్ వంటి గిం జలు,మొలకల్లో గుండెకు మేలు చేసే పాలీఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (పుఫా), ఎమినో యాసిడ్స్ ఉంటయ్ .ఇవిహెల్దీ కొలెస్ట్రాల్ ని కాపాడుతూ.. రక్త ప్రవాహాన్నిమెరుగుపరుస్తయ్ .అంతేకాకుం డా, ఇవి తినగానే శరీరానికి వెంటనే శక్తి అందుతది. పిడికెడు గింజలులేదా పప్పులు తింటే చాలు..ఆకలి బాధే ఉండదు. వీటిని తింటే ‘అతిగా తినే బ్రేక్ ఫాస్ట్ తర్వాత లంచ్ కి మధ్య 250 గ్రాముల పండ్లు,పచ్చికూరడగాయలు తినాలి.
బ్రేక్ ఫాస్ట్ లో..
ఇడ్లీ సాంబార్/ పెరుగు లేదాఏదైనా పచ్చడితో వెజిటబుల్‌పరాటా/ పుదీనా చట్నీతోవెజిటబుల్ ఊతప్పం/ వీలును బట్టివీటిలో దేన్నైనాబ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు.
లంచ్ లో..
సలాడ్ తో పాటు.. ఏవైనా గిం జలు లేదా పప్పు ధాన్యా లు పిడికెడు తినాలి. ఇది కుదరకుంటే 250 గ్రాముల వెజిటబుల్ రైతా తినాలి
డిన్నర్ లో..
పండ్లు, పైన చెప్పి న వాటిలో ఏవైనా ఒక పిడికెడుగిం జలు తినాలె. ఈ డైట్ చిన్నగానే కనిపిస్తున్నా..ఫాలో అయితే బరువు తగ్గడం ఖాయం. మధ్యాహ్నంతినడానికి ముందు ఒకటి లేదా రెండు గ్లాసులు జీలకర్ర కలిపిన వేడి నీళ్లు తాగాలె. పైన చెప్పి న డైట్ తోపాటు ఇలా మొదటి మూడు రోజులుచెయ్యాలె. నాలుగో రోజు మాత్రం తాజా పండ్లు, కూరగాయల రసం తాగాలి.తర్వా త మూడు రోజులు ఇదే డైట్ , జీలకర్ర కలిపిన వేడినీళ్లతో కొనసాగిం చాలె.
సాయంత్రం
250 గ్రాముల వెజిటబుల్ సూప్ /ఉడికిం చిన ఆకుకూరలు/ ఉడికిం చినఅనప (సొర) కాయ తినాలె.అలవాటు’కు బ్రేక్ పడ్తది.
ఆకు కూరలతో
మన దగ్గర పెరిగే పాల కూర,ఆవ, మెం తికూరల్లో ఎన్నోవిటమిన్స్ ఉంటయ్ . వీటినితీసుకోవడం వల్ల శరీరానికితక్కువ క్యాలరీలతోనే.. ఎక్కువ శక్తిఅందుతుం ది. కాబట్టి బరువుతగ్గా లనుకునేవాళ్లు తమ డైట్ లోఆకు కూరలు కూడా భాగంచేసుకోవాలె.
వారం రోజుల డైట్ ప్లాన్
వారం రోజుల్లో మూడు నాలుగు కేజీలుతగ్గడానికి ఈ డైట్ ఫాలో అవ్వాలి . దీని కోసంఎక్కడెక్కడో తిరిగి.. ఆహారాన్ని కొనుక్కో వాల్సిన అవసరం లేదు. పైన చెప్పి న పదార్థా లుఇక్కడే దొరుకుతయ్ . వాటిని డైట్ లో భాగంచేసుకుంటే చాలు.. బరువు తగ్గుతరు. అలా తయారు చేసిందే ఈ ‘వెయిట్ లాస్ ’ డైట్ ప్లాన్ !
పొద్దు పొద్దున లేస్తూనే..
పొద్దున లేస్తూనే.. రెండు గ్లాసుల నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ ల ఉసిరికాయల పొడి కలుపుకుని తాగాలె.
మంచి నిద్ర కూడా..
కేవలం ఈ డైట్ ఫాలో అయితే సరిపోదు.దీనితో పాటు సరిగ్గా నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం . ఆకలి, హార్మోన్స్ విడుదల, కొవ్వు నుంచి విడుదలయ్యే లెప్టిన్ ప్రొటీన్లపై నిద్ర ప్రభావం తీవ్రంగా చూపుతది. కాబట్టి ఈడైట్ తో పాటు కనీసం ఏడు నుం చి ఎనిమిది గంటలు కచ్చితంగానిద్రపోవాలె. అది కూడా రాత్రివేళలోనే! ఈ ఏడు రోజుల్లో డిటాఫికేషన్ జరగడం వల్ల బరువు తగ్గడంతో పాటు.. శరీరంలోఉన్న వ్యర్థ పదార్థాలు బయటకుపోతయ్ . దీంతో ఆరోగ్యం మెరుగు పడ్తది. ఈ డైట్ తో శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు.. తక్కువ క్యాలరీలు తిం టరు. కరెక్ట్‌గా ఆడైట్ ఫాలో కాకున్న పైన చెప్పి నఆహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకున్నా .. దీర్ఘకాలంలో బరువు తగ్గడంలో మంచి ఫలితం ఉంటదంటున్నరు నిపుణులు.