అభ్యాసన్ గల్లీ : రాత్రిపూట కంబైన్డ్ స్డడీస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అభ్యాసన్ గల్లీ : రాత్రిపూట కంబైన్డ్ స్డడీస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఇది ముంబై మహానగర పాలక సంస్థ పరిధిలోని వర్లీ ప్రాంతం. ఇక్కడ వీధి లైట్ల కింద చదువుకుంటున్న వారంతా ఉన్నత చదువులు చదువుతున్నవారే. ఇంట్లో చదువుకునేందుకు ఇబ్బంది పడేవారికోసం బృహణ్ ముంబయి మహానగర పాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. వీరు చదువుకునే కాలనీలకు అభ్యాసన్ గల్లీ అని పేరు కూడా పెట్టింది.  రాత్రి టైమ్లో ఇంట్లో చదువుకోవడం వీలు కాకపోవడంతో వీధుల్లో చదువుకుంటున్నామని చెప్తున్నారు విద్యార్థులు. ఇంట్లో అందరూ నిద్రపోయే సమయంలో చదువుకునేందుకు అంతగా ఆసక్తి ఉండదని అందుకే వీధుల్లో కంబైన్డ్ స్డడీస్ చేస్తున్నామని చెప్తున్నారు విద్యార్థులు. మామూలు రోజుల్లో రాత్రి పూట రెండు నుంచి 3 గంటలు… పరీక్షలు ప్రారంభమైన రోజుల్లో 5 నుంచి 6 గంటలు ఇక్కడే చదువుకుంటున్నామని చెప్తున్నారు.

ఈ కాలనీల్లో చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్తున్నారు స్టూడెంట్స్. గ్రూప్ గా చదువుకోవడం వల్ల సందేహలను నివృత్తి చేసుకోగలమని చెప్తున్నారు. అంశాల వారీగా చర్చించుకోవడానికి వీలుగా ఉంటుందని అంటున్నారు.రాత్రి వేళ తమ చదువుల కోసం ముంబై మహా నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలు బాగున్నాయని చెప్తున్నారు విద్యార్థులు. స్లూడెంట్స్ కోసం డ్రింకింగ్ వాటర్, లైట్స్, ఎలాంటి సౌండ్స్ లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఐడియా బాగుందంటున్నారు సిటీవాసులు.