కరోనా ఎప్పుడో పోయింది: బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ 

కరోనా ఎప్పుడో పోయింది: బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ 

పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య రాజకీయ పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఓ సభలో మాట్లాడుతూ… కరోనా వైరస్ ఎప్పుడో పోయిందని, కానీ సభలు పెట్టనివ్వకుండా బీజేపీని అడ్డుకునేందుకు సీఎం మమతా బెనర్జీ కావాలనే వైరస్ ఉందంటూ లాక్ డౌన్లు విధిస్తున్నారని ఆరోపించారు.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల క్రమంలో బీజేపీని ప్రజలకు దగ్గర కానివ్వకుండా మమతా బెనర్జీ ప్లాన్ చేస్తున్నారన్నారు దిలీప్ ఘోష్. రాష్ట్రంలో తమను సభలు, సమావేశాలు జరపనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే తమను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

ఓవైపు భారత్ లో ప్రతీ రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుంటే…. దేశంలో కరోనా ఎప్పుడో పోయిందంటూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ చీఫ్ మాట్లాడటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.